The Kashmir Files Unreported | వెబ్ సిరీస్ ఫార్మాట్లో.. కాశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్
1990లలో జమ్మూకశ్మీర్‌లో తిరుగుబాటు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
The Kashmir Files | 1990లలో జమ్మూకశ్మీర్‌లో తిరుగుబాటు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేయడమే కాదు.. సూపర్ హిట్ టాక్‌తోపాటు నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం రూ.250 కోట్ల మార్కును దాటేసినట్టు సమాచారం. అయితే చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్ను అందించారు. కాశ్మీర్ ఫైల్స్‌ను వెబ్-సిరీస్ ఫార్మాట్లో తీసుకువస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు.
కాశ్మీర్ ఫైల్స్ సినిమాను.. కాశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్( (Kashmir Files Unreported) పేరిట వెబ్-సిరీస్ ఫార్మాట్లో విడుదల చేస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్లో ప్రకటించారు. “చాలా మంది మారణహోమన్ని తిరస్కరించేవారు, తీవ్రవాద మద్దతుదారులు, భారత్‌కు శత్రువులు కాశ్మీర్ ఫైల్స్‌ని ప్రశ్నించారు. కాశ్మీర్ హిందువుల మారణహోమానికి సంబంధించి అసభ్యకరమైన సత్యాన్ని ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నాను.. ఇది దెయ్యం మాత్రమే ప్రశ్నించగలదు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’లో చిత్రీకరించబడిన వాటి గురించి నిజమైన వ్యక్తులు తమ అనుభవాల గురించి మాట్లాడుకోవడం ఇందులో చూస్తారు. త్వరలో #KashmirUNREPORTED. ఏడవడానికి సిద్ధంగా ఉండండంటూ”.. వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్లో రాసుకొచ్చారు.
ఇక కాశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్ వెబ్-సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ కానుండగా.. విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
PRESENTING:
A lot of Genocide Deniers, terror supporters & enemies of Bharat questioned The Kashmir Files. Now bringing to you the VULGAR truth of Kashmir Genocide of Hindus which only a devil can question.
Coming soon #KashmirUNREPORTED. Be ready to cry.
Only on @ZEE5India… pic.twitter.com/DgGlnzSKwA
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 19, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

