లండన్: బ్రిటన్కు చెందిన బెల్వెదర్ ఇండస్ట్రీస్ ఈ ఎగిరే కారును తయారు చేసింది. నవంబర్లో దుబాయ్లో పరీక్షించింది. తాజాగా ఆ వీడియోను విడుదల చేసింది. ఈ కారు 13 అడుగుల ఎత్తుదాకా ఎగిరి గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకొన్నది. వాస్తవానికి 3వేల అడుగుల ఎత్తులో గంటకు 217 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఎగిరే కారును తయారుచేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకొన్నది. అందులో భాగంగానే ఆ కారు నమూనాపై ఈ పరీక్ష నిర్వహించింది. పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు దీన్ని తయారుచేశారు. కారు పదేండ్లలో అందుబాటులోకి వస్తుందని బెల్వెదర్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.