ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసమే బర్రెల పంపిణీ

పెద్దపల్లి : ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద బర్రెలు పంపిణీ చేస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన, మల్లాపూర్‌లో ఎస్సీ (మాల), ధర్మారంలో స్వర్ణకారుల కమ్యూనిటీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం దొంగతుర్తిలో 8 గ్రామాలకు చెందిన 32 మంది ఎస్సీ లబ్ధిదారులకు పైలట్ ప్రాజెక్టు కింద రూ.కోటి 28 లక్షల విలువైన బర్రెలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎస్సీలకు బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, పాల విక్రయాల ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చునని తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఇప్పటి వరకు 1,75,000 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.
కార్యక్రమంలో పెద్దపల్లి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజేశ్వరి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి నారాయణ, ఆర్డీవో శంకర్ కుమార్, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఎంపీడీఓ జయశీల, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

