నోటరీ గరిష్ఠ పరిమితి 15 ఏండ్లు!
- చట్టానికి సవరణలు
- డ్రాఫ్ట్ బిల్లు విడుదల

న్యూఢిల్లీ: నోటరీస్ చట్టం-1952కు పలు సవరణలు ప్రతిపాదించిన కేంద్రం.. ఆ ముసాయిదాను ప్రజాబాహుళ్యంలో ఉంచింది. ప్రజావ్యవహార విభాగం వెబ్సైట్లో డ్రాఫ్ట్ బిల్లును అప్లోడ్ చేసింది. దీనిపై ఈ నెల 15లోగా సలహాలు, సూచనలు తెలియజేయాలని ప్రజలను కోరింది. న్యాయసేవలు, నోటరీ రంగంలో యువ ప్రాక్టీషనర్లకు అవకాశం కల్పించడం, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి పలు కీలక సవరణలను ఈ డ్రాఫ్ట్ బిల్లులో ప్రతిపాదించింది.
బిల్లులో ప్రతిపాదిత సవరణలు
- నోటరీగా ప్రాక్టీసును కొనసాగించే వారు ఇకపై గరిష్టంగా 15 ఏండ్లు మాత్రమే పనిచేయాలి.
- తొలి ఐదేండ్లు పూర్తిచేసుకొన్న నోటరీ ప్రాక్టీషనర్.. విధిగా సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేసుకోవాలి.
- ఐదేండ్లకు ఒకసారి చొప్పున ఈ రెన్యువల్ ప్రక్రియ ఉంటుంది. గరిష్టంగా రెండుసార్లు మాత్రమే సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేస్తారు. గతంలో పూర్తి జీవితకాలం వరకు సర్టిఫికెట్ రెన్యువల్ ప్రక్రియను అనుమతించేవారు. ఇకపై అది కుదరదు.
- ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాక్టీషనర్ల లైసెన్సు సర్టిఫికెట్‌ను రద్దు చేయడంతో పాటు వారిపై ఎంక్వైరీ వేసే అధికారం కేంద్ర/రాష్ర్టాలకు ఉంటుంది.
- నోటరీలు చేశాక, ఆ పత్రాలను ప్రాక్టీషనర్లు డిజిటల్ రూపంలో అప్లోడ్ చేయాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

