Tollywood News | పూరీ జగన్నాథ్‌కు హరీశ్ శంకర్‌కు అదే తేడా!
మిస్టర్ బచ్చన్,డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు అనుకోకుండా ఆగస్టు 15న పోటా పోటిగా విడుదలయ్యాయి.రెండు సినిమాలు కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సీఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.
ఈ ఇద్దరూ ప్రతిభ గల దర్శకులే.. అంతేకాదు ఇద్దరూ టాలీవుడ్లో క్రేజ్ వున్న డైరెక్టర్లే.. అయితే ఈ దర్శకులిద్దరూ ఈ ఆగస్టు 15 సినిమాల విషయంలో పోటిపడ్డారు. రవితేజ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. కావ్య థాపర్ నాయికగా నటించిన ఈ చిత్ర నిర్మాణంలో చార్మి కౌర్ కూడా పాలు పంచుకున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు అనుకోకుండా ఆగస్టు 15న పోటా పోటిగా విడుదలయ్యాయి.
ఈ చిత్రం విడుదల సమయంలో తమ సినిమాకు పోటీగా వస్తున్నారని రవితేజ, హరీశ్ శంకర్ పట్ల పూరి అసంతృప్తిగా వున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఎక్కడా పూరి ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు. కాని మిస్టర్బచ్చన్ టీమ్ మాత్రం పరోక్షంగా ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇక ఎట్టకేలకు రెండు సినిమాలు విడుదలయ్యాయి.
రెండు సినిమాలు కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సీఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అయితే హరీశ్ శంకర్ విషయానికొస్తే సినిమా విడుదలకు ముందు హరీశ్ శంకర్ ట్విట్టర్ వార్, ప్రెస్మీట్స్ల్లో ఆయన మాట్లాడిన తీరు.. మీడియాతో కాస్త అతి సంభాషణ.. సినిమా అద్బుతం.. ఆహో.. ఓహో.. అంటూ హరీష్ చేసిన హంగామా వల్ల ఇప్పుడు హరీష్ సోషల్ మీడియాలో ట్రోల్‌కు గురవుతున్నాడు.
సక్సెస్, ఫెయిల్యూర్స్ మన చేతుల్లో వుండవు.. కానీ హరీశ్ శంకర్ సినిమా విడుదలకు ముందు మాట్లాడిన మాటల పర్యవసానం వల్ల ఇప్పడు ఆయనపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక పూరి జగన్నాథ్ ఈ విషయంలో లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు పూరి ఎక్కడా కూడా అతిగా మాట్లాడటం.. సినిమాని ఆకాశానికి ఎత్తడం చేయలేదు. ఎక్కడా కూడా ఆయన హంగామా కనిపించలేదు.
అందుకే పూరీ సినిమా డబుల్ ఇస్మార్ట్ పరాజయం పొందినా.. పూరిపై పెద్దగా విమర్శలు రావడం లేదు. ఎందుకంటే తన పాడ్‌కాస్ట్ ద్వారా ఎంతో మంది ఉత్తేజితులను చేసి, పలు మోటివేట్ మాటలు చెప్పే పూరి ఈ సినిమా విషయంలో కూడా సినిమా తీశాం. జనాలకు నచ్చితే చూస్తారు.. లేకపోతే లేదు.మరో సినిమా తీద్డాం.ఇది ఆయన ఫిలాసఫీ.. అంతేకాదు పూరి కమ్‌బ్యాక్… మీరు హిట్ తీయాలి అంటూ ఆయనకు ఓ రకంగా సపోర్ట్ చేస్తున్నారు. దటీజ్ పూరి జగన్నాథ్..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

