రమణ కథానాయకుడిగా రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పాయిజన్’. కె.శిల్పిక నిర్మాత. ట్రైలర్ను ఇటీవల హైదరాబాద్లో నిర్మాత సి.కల్యాణ్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంది. యువతరానికి కావాల్సిన అన్ని హంగులతో సినిమాను తెరకెక్కించారు’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రాహుల్ అనే యువకుడి కథ ఇది. తాను చేయని ఓ నేరం కారణంగా అతడు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. రొమాన్స్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించాం’ అని తెలిపారు. త్వరలో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదలచేయబోతున్నట్లు నిర్మాత చెప్పారు.