హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఆక్వాటిక్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్విమ్మర్ వృతి అగర్వాల్ సత్తాచాటింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న టోర్నీలో బుధవారం పదిహేనేండ్ల వృతి కాంస్య పతకం కైవసం చేసుకుంది. 1500 మీటర్ల సీనియర్ ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన వృతి మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజన్ జాతీయ రికార్డు నమోదు చేశాడు. పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టయిల్లో 49.94 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన నటరాజన్ తన పేరిటే ఉన్న రికార్డు (50.17 సె.)ను బద్దలు కొట్టాడు.