న్యూఢిల్లీ: జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ కాంస్య పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ మిక్స్డ్ టీమ్ఈవెంటులో ఇషాసింగ్, గోపు కౌశిక్ జోడీ కాంస్య పతకం దక్కించుకుంది. పురుషుల జూనియర్ స్కీట్ ఈవెంటులో రాష్ర్టానికి చెందిన మునేక్ బత్తుల కాంస్యం దక్కించుకున్నాడు. స్కీట్ షూటింగ్లో తెలంగాణ త్రయం మునేక్, శ్రేయాన్, చేతన్రెడ్డి కాంస్యం ఖాతాలో వేసుకున్నారు. పురుషుల జూనియర్ స్కీట్ షూటింగ్ కేటగిరీలో మునేక్, అయూష్, యువెక్ త్రయం రజత పతకంతో మెరిసింది. వెటరన్ పురుషుల స్కీట్ షూటింగ్లో గుస్తి నోరియా రజతం దక్కించుకున్నాడు. విజేతలకు తెలంగాణ రైఫిల్ అసోసియేషన్(టీఆర్ఏ) అభినందనలు తెలిపింది.