ఫ్రెంచ్ పెట్టుబడులకు క్లస్టర్

- పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం
- అత్యంత పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు
- యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరంలో ప్రసంగం
- పలు అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో సమావేశం
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులతో వస్తే ఫ్రెంచ్ ఎస్ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న కేటీఆర్, శుక్రవారం ప్యారిస్‌లోని ఆ దేశ సెనేట్‌లో ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరంలో కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలను వివరించారు. ‘గ్రోత్: డ్రాఫ్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ ఏ పోస్ట్ కొవిడ్ ఎరా’ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన వచ్చింది. గత ఏడేండ్లుగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును మంత్రి వివరించారు. పరిశ్రమలకు భూముల కేటాయింపు, సత్వర అనుమతులు, నాణ్యమైన మానవ వనరులు, వనరుల సేకరణ తదితర అంశాలను సెనేట్‌లో వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించాలని ఫ్రెంచ్ పెట్టుబడిదారులను కోరారు.
పారదర్శకంగా అనుమతులు..
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ గురించి కేటీఆర్ వివరించారు. పారదర్శకతతో పాటు సెల్ఫ్ సర్టిఫికేషన్‌ను అవలంబిస్తున్న అద్భుత చట్టమని చెప్పారు. రాష్ట్రంలో పెట్టే పరిశ్రమలకు ఈ చట్టం ద్వారా 15 రోజుల్లో అన్నిరకాల అనుమతులు లభిస్తాయని తెలిపారు. 15 రోజుల్లో అనుమతుల రాకపోతే 16వ రోజున, పూర్తి అనుమతులు లభించినట్టే భావించాలని అన్నారు. టీఎస్ఐఐసీలో రెండు లక్షల ఎకరాల పారిశ్రామిక స్థలాలు అందుబాటులో ఉన్నాయని, ఈ భూములకు విద్యుత్తు, నీరు, ఉత్తమ మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా ప్రభుత్వం తన సొంత ఖర్చులతో నైపుణ్య శిక్షణ ఇస్తూ యువకులను నాణ్యమైన మానవ వనరులుగా మారుస్తున్నదని వివరించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకొంటే ఇతర రాష్ర్టాలకంటే తెలంగాణలో మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమంలో తెలంగాణను భాగస్వామిగా ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

గ్లోబల్ సీఈవోలతో సమావేశాలు
మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం పలు ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. పారిస్‌లో మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (ఎంఈడీఈడీ) డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో చర్చలు జరిపింది. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ సాధించిన విజయాలను కేటీఆర్ వివరించారు.
స్టేషన్ ఎఫ్‌లో కేటీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ ‘స్టేషన్ ఎఫ్’లో మంత్రి కేటీఆర్ పర్యటించి స్టేషన్ ఎఫ్ బృందంతో భేటీ అయ్యారు. టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ వంటి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ సంస్థల గురించి వివరించారు. స్టేషన్ ఎఫ్‌లో వెయ్యి స్టార్టప్‌లు ఉన్నాయి. ఏడీపీ చైర్మన్, సీఈవో అగస్టిన్ డి రోమనెట్‌తో కూడా కేటీఆర్ బృందం సమావేశమైంది. ఏడీపీ ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడి పెట్టింది. భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కరోనా ఆంక్షలు సడలించడంతో పరిశ్రమ దేశంలో పెద్దఎత్తున విస్తరించే అవకాశాలున్నాయని కేటీఆర్ చెప్పారు. అనేక ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నదని వివరించారు. అనంతరం సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ ఫాబ్రిస్ బస్చిరా, గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్స్ను కేటీఆర్ కలిశారు. సనోఫీ త్వరలో తన హైదరాబాద్ ఫెసిలిటీ నుండి సిక్స్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుండగా, కేటీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి వెంట పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

