మన ఊరి సైంటిస్టులు..!

- ప్రత్యేక కార్యక్రమాలతో ఔత్సాహికులకు ప్రోత్సాహం
- ఇప్పటివరకు 23వేల మంది విద్యార్థులు భాగస్వామ్యం
- ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ.. అవకాశం కల్పిస్తున్న
- తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా.. ఇన్నోవేషన్..
- కొత్త ఆలోచనల సాక్షాత్కారం టీఎస్‌ఐసీతో ఎల్లలు దాటేలా.. ఆవిష్కరణలు
అవసరం నుంచే ఆలోచన పుడుతుంది. ఆలోచనతోనే ఆవిష్కరణ పుట్టుకొస్తుంది. ఐడియా ఒక్కరి సొత్తు కాదు.. కానీ ఒక్కోసారి ఎన్నో జీవితాలను మార్చేస్తుంది. ప్రపంచానికి ఎంతో మంది శాస్త్రవేత్తలను పరిచయం చేసింది ఇలాంటి ఇన్నోవేషన్లే. మన పల్లెలు, పట్టణాల్లోనూ ఇలాంటి నవ యువ సైంటిస్టులెందరో ఉన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మన ఊరి సైంటిస్టులు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు 33 జిల్లాల పరిధిలో 23వేల మంది విద్యార్థులను ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాల్లో భాగస్వాములను చేసింది. ఇకనుంచి సరికొత్త ఆవిష్కరణలు చేయాలన్న ఆసక్తిని కల్పించింది.
సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : సృజనాత్మకతే సరికొత్త ఆవిష్కరణలకు మూలాధారం. అలాంటి ఆవిష్కరణలు నగరానికి మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ స్థాయి నుంచి తీసుకువచ్చేలా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆవిష్కరణల పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) పనిచేస్తున్నది. రాష్ట్ర ఐటీ శాఖ 2016లో తీసుకువచ్చిన ఇన్నోవేషన్ పాలసీలో భాగంగా 2017లో ఏర్పాటు చేసిన టీఎస్ఐసీ గ్రామీణ స్థాయి నుంచి ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా కృషి చేస్తున్నది.
స్వాతంత్య్ర వేడుకల్లో ప్రదర్శన
ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవాల్లో జిల్లా స్థాయిలోని ఆవిష్కరణలతో ఓ ప్రదర్శనను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయం, పారిశుధ్యం, రవాణ, నీరు, ఆరోగ్యం తదితర రంగాల్లో పాఠశాల విద్యార్థులే కాకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా టీఎస్ఐసీ బాధ్యతలు తీసుకుంది. టీ హబ్ కేంద్రంగా టెక్నాలజీతో కూడిన స్టార్టప్‌లకు ప్రాధాన్యతనిస్తే, టీఎస్ఐసీ ఆధ్వర్యంలో సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సరికొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంపై సరికొత్త ఆవిష్కరణలు
స్టార్టప్‌ల రంగంలో విశేష అనుభవం ఉన్న శాంత థౌటమ్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ 2021 సెప్టెంబర్‌లో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌గా నియమించింది. టీ హబ్‌లో పనిచేసిన అనుభవం ఉండటంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలే కాకుండా.., అన్ని విద్యా సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ శాఖలు ఇన్నోవేషన్ సెల్‌తో కలిసి పనిచేస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలను ఎంచుకొని వాటికి పరిష్కార మార్గాలను చూపేలా సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లను నియమించగా, వారితో కలిసి చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ప్రతినెలా వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ స్థాయి నుంచి ఆవిష్కరణలు రావాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన టీఎస్ఐసీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
టీఎస్ఐసీ ఇప్పటి వరకు చేపట్టిన కార్యకలాపాలు..
- 52 స్టార్టప్ సంస్థలకు రూ.1.80కోట్ల ఆర్థిక సాయం
- 262 రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అధికారులకు స్టార్టప్‌లపై ప్రత్యేక అవగాహన
- 80 స్టార్టప్‌లను ప్రభుత్వ శాఖలతో అనుసంధానం
- 16 స్టార్టప్‌లు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంపికై, కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
- 100కు పైగా స్టార్టప్‌లకు రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలకు అవకాశం కల్పించారు.
- 30 మంది ఆవిష్కర్తలకు అవసరమైన మెంటారింగ్, ఫండింగ్ సమకూర్చారు.
- ఆగస్టు 15న ప్రతియేటా ఆవిష్కరణల కోసం ప్రతి జిల్లా పరిధిలో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసి అందులో ప్రదర్శన ఇచ్చేలా అవకాశం కల్పించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

