సీఎం కేసీఆర్‌కు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కృతజ్ఞతలు

హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షురాలు వి. మమత, ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ అధ్వర్యంలో మంగళవారం జరిగింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గం, తెలంగాణ అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సచివాలయం, హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
తీర్మానాలు..
- తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం పీఆర్సీ ఫిట్మెంట్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, హోంగార్డులు, ఆశావర్కర్లు, గ్రామసేవకులు, తదితర మొత్తం ఉద్యోగులందరికి జీతాలు పెంచుటకు అంగీకరించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదులు తెలుపుతు తీర్మానం.
- పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంపుదల చేసినందుకుగాను
- ప్రమోషన్లు పొందుటకు నిర్దేశించిన 3 ఏండ్ల కాలాన్ని 2 ఏండ్లకు కుదిస్తూ జీవో విడుదల చేసి ఒకే నెలలో 24 వేల మందికి ప్రమోషన్లు కల్పించినందుకుగాను
-రిట్రైడ్ ఉద్యోగులకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 75 సంవత్సల నుండి 70 ఏండ్లకు కుదించినందుకు, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చుటకు నిర్ణయం తీసుకున్నందకు - వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నిర్ణయించినందుకు
- అర్హులైన రాష్ట్ర కేడర్ అధికారులకు ఐఏఎస్ కన్పర్ చేయాలని కోరుతూ సమావేశం తీర్మానించడమైనది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ నాయకులు ఎస్.సహదేవ్, రవీందర్‌కుమార్, రవీందర్రావు, నగరశాఖ అధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.బి.కృష్ణయాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వినయ్‌కుమార్, రాజ్‌కుమార్‌గుప్తా, కేంద్ర నాయకులు బి. వెంకటయ్య, డి.అరుణ్ కుమార్, వి.సుజాత, సబిత, ప్రణయ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహులు, యాదగిరి, హరికృష్ణ, లక్ష్మణ్‌గౌడ్, స్వరూపరాణి, లావణ్య, రంజిత్‌నాయక్, ఆనంద్‌కుమార్, గోపాల్‌నాయక్, గోపిచంద్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

