నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. జీవార్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఆ విమానాశ్రయానికి టాటా ప్రాజెక్ట్స్ కాంట్రాక్టును గెలుచుకున్నది. ఒప్పందంలో భాగంగా విమానాశ్రయానికి చెందిన టర్మినల్, రన్‌వే, ఎయిర్‌సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, ఎయిర్పోర్ట్ బిల్డింగ్‌లను టాటా ప్రాజెక్ట్స్ నిర్మించనున్నట్లు యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. స్విట్జర్లాండ్ డెవలపర్ జూరిచ్ ఎయిర్పోర్ట్ సంస్థకు వంద శాతం సబ్సిడరీగా యమునా ఇంటర్నేషనల్ సంస్థ పనిచేస్తున్నది. నోయిడా ఎయిర్‌పోర్ట్‌ను డెవలప్ చేసేంఉదకు జూరిచ్ సంస్థ బిడ్‌ను గెలుచుకున్నది. నోయిడా విమానాశ్రయం దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా అవతరించనున్నది. 2024 వరకు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. 1334 హెక్టార్లలో దీన్ని నిర్మిస్తున్నారు. 5700 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.