భ్రమల్లోంచి బయటపడ్డా!

కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రల్లో అలరించిన పంజాబీ సుందరి తాప్సీ ప్రస్తుతం వాటికి పూర్తిగా స్వస్తి పలికింది. విభిన్న కథాంశాలు, ప్రయోగాత్మక పాత్రల్ని ఎంచుకుంటూ బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది. మహిళా ప్రధాన చిత్రాలకు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కెరీర్ తొలినాళ్లలో అందం, విజయం తాలూకు అంశాల పట్ల తన దృక్పథం వేరుగా ఉండేదని..ఈ ప్రయాణంలో పరిణితి సాధించానని తాప్సీ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘తొలిరోజుల్లో అందంగా కనిపించాలని తాపత్రయపడేదాన్ని. గ్లామర్ హంగులతో ఆకట్టుకుంటే అభిమానగణం పెరుగుతుందని, పెద్ద సినిమాల వల్ల మాత్రమే గుర్తింపు వస్తుందనే భ్రమలో విహరించేదాన్ని. అయితే కాలక్రమంలో నా ఆలోచనలు తప్పని అర్థం చేసుకున్నా. అందరు నడిచే దారిలో ప్రయాణం ఎప్పుడూ కొత్తగా ఉండదని తెలుసుకున్నా. కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడి ఆలోచిస్తేనే మనకంటూ ఓ గుర్తింపు లభిస్తుందని అర్థమైంది. కేవలం హీరోయిన్లా మాత్రమే కాకుండా నటిగా నిరూపించుకోవాలనుకున్నా. అక్కడి నుంచే విజయాలు వరించడం మొదలైంది’ అని తాప్సీ చెప్పింది. ప్రస్తుతం ఆమె హిందీలో ‘శభాష్ మిత్తు’ చిత్రంలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

