Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరల్డ్ నంబర్ 1 స్వియటెక్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టైటిల్‌పై గురి పెట్టిన ఆమె మూడో రౌండ్లో సునాయసంగా గెలిచింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో క్వాలిఫయర్ క్రిస్టినా బక్సా (స్పెయిన్)ను ఆమె ఓడించింది. స్వియటెక్ ధాటికి క్రిస్టినా చేతులెత్తేసింది. రెండు సెట్లలో క్రిస్టినాను 6-0, 6-1తో చిత్తు చేసి నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన స్వియటెట్ 55 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ‘క్రిస్టినా నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని నాకు తెలుసు. అందుకనే ఆమెకు అవకాశం ఇవ్వకూడదు అనుకున్నా. వరుస సెట్లు గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. క్రమశిక్షణతో ఆడడమే కాకుండా నా బలాబలాలపై దృష్టి పెట్టాను’ అని 21 ఏళ్ల స్వియటెక్ మ్యాచ్ అనంతరం వెల్లడించింది.
వరల్డ్ నంబర్ వన్ స్వియటెక్ ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. పోయిన ఏడాది యూఎస్ ఓపెన్, 2020లో వింబుల్డన్ టైటిళ్లు సాధించింది. ఈ పోలాండ్ క్రీడాకారిణి ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌పై గురి పెట్టింది. నాలుగో రౌండ్లో ఆమె వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినాతో తలపడనుంది. మరొక మ్యాచ్‌లో పోయిన ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరస్ డానియెల్లె కొలిన్స్‌ను 6-2, 5-7, 6-2తో రిబాకినా నాలుగో రౌండ్లో మట్టి కరిపించింది.