టైటిల్ మీరే చెప్పాలి!
సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’)చిత్రం ఓటీటీ వేదికలో ప్రేక్షకుల్ని మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది. అక్షయ్‌కుమార్ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమా హిందీ రీమేక్ సోమవారం ముంబయిలో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా హీరో సూర్య నిర్మాతగా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నారు. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ స్ఫూర్తిదాయక జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. మాతృక దర్శకురాలు సుధా కొంగర హిందీ రీమేక్ నిర్దేశక బాధ్యతల్ని తీసుకుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాల తాలూకు వీడియోను అక్షయ్‌కుమార్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాకు హిందీలో మంచి టైటిల్ సూచించమని ఆయన అభిమానుల్ని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

