రైతుల ఆందోళనపై కేంద్రానికి సుప్రీం చివాట్లు
Supreme Court slammed the Center and the Haryana government | రైతులను ఆందోళన విషయంలో కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. రోడ్ల దిగ్బంధనంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను

న్యూఢిల్లీ : రైతులను ఆందోళన విషయంలో కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. రోడ్ల దిగ్బంధనంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారులపై నిరసనలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. జాతీయ రహదారులను దిగ్బంధించడం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది. నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జ్యుడీషియల్ ఫోరం, పార్లమెంటరీ చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని పేర్కొంది.
కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ నియమించామని, చర్చలకు నిరసనకారులు నిరాకరించారని తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ కోర్టులు సూచించిన వాటిని మీరు అమలు చేయాల్సి పేర్కొంది. అయితే ఈ కేసులో ఎవరైనా పార్టీ కావాలని మీరు కోరుకుంటే.. పిటిషన్ దాఖలు చేయాలని చెప్పింది. ఈ మేరకు రైతులను ప్రతివాదులుగా చేర్చాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేయగా.. ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
అంతకు ముందు హర్యానా ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హైవేపై ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసేందుకు నిరసన తెలుపుతున్న రైతులను ఒప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ఆందోళన సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్‌ను రైతులు కలువలేదని హర్యానా సర్కారు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా.. నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. రైతుల ఆందోళనతో నోయిడా – ఢిల్లీని కలిపే రహదారులు మూతపడ్డాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్లు తెరవాలని పిటిషన్లో కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

