వాషింగ్టన్, నవంబర్ 16: పదిహేను కోట్ల ఏండ్ల క్రితం భూమిపై సంచరించిన రాక్షసబల్లుల జాతికి చెందిన ఓ భారీ సూపర్సారస్ శిలాజాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. కొలరాడో ఎడారిలో కనుగొన్న ఈ డైనోసార్ శిలాజం 140 అడుగుల పొడవు ఉన్నట్టు తెలిపారు. దాని ఎముకలను కూడా గుర్తించారు. ఈ జాతిలో ఇప్పటివరకూ ఇదే అత్యంత పొడవైనది.