సన్డే ఫన్ డే లో భాగంగా నాగార్జున హౌజ్ మేట్స్‌తో వెరైటీ గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా ఒక కంటెస్టెంట్ మిగతా కంటెస్టెంట్లా మారి సందడి చేయాల్సి ఉంటుంది. శ్రీరామచంద్రలా మారిన మానస్..బాగానే ఇమిటేట్ చేశాడు. శ్రీరామచంద్రలా పాడాడు. ఫైనల్ స్పీచ్ శ్రీరామచంద్ర ఇస్తే ఎలా ఉంటుందో మాట్లాడి చూపించాడు. ఆ తరువాత కాజల్‌లా మారిన శ్రీరామచంద్ర.. దుమ్ములేపేశాడు.
అచ్చం కాజల్ మాదిరిగానే హావభావాలు ప్రదర్శించాడు. నవ్వు, నడక, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా ఆమె మాదిరిగానే ఇమిటేట్ చేశాడు. ఆ తరువాత సన్నీ వచ్చి సిరిలా మారిపోయాడు. హగ్గులు, షన్ను మ్యాటర్ తీస్తూ సిరిని బాగా రోస్ట్ చేసి పాడేశాడు. ఇక షన్నులా మారిన కాజల్.. అదరగొట్టేసింది. చివరకు షన్ను.. సన్నీలా నటించేందుకు ప్రయత్నించాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు.
అలా చివరకు కాజల్ ఎలిమినేట్ అయింది. మానస్ టాప్ 5లోకి వెళ్లిపోయాడు.కాజల్ ఎలిమినేట్ అయిందని ప్రకటించగానే మానస్, సన్నీల ముఖాలు మాడిపోయాయి. ఎప్పుడు లేనిది మానస్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆమెను గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు. సన్నీ కూడా చాలా బాధపడ్డాడు. కాజల్ మాత్రం నవ్వుకుంటూ వెళ్లిపోయింది. నన్ను మాత్రం మిస్ అవుతుండండి అని చెబుతూ బిగ్ బాస్‌కి గుడ్ బై చెప్పింది.