బాషా ప్రేరణతో చేశాం

‘నా కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయే సినిమా ఇది. నిర్మాతలకు చక్కటి లాభాల్ని తెచ్చిపెట్టింది. ఏడాదిన్నర శ్రమకు మంచి ఫలితం దక్కింది’ అని అన్నారు సందీప్‌కిషన్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్‌కిషన్, దయాపన్నెం నిర్మించారు. డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర విజయోత్సవ వేడుకను నిర్వహించారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు వినోదాత్మక చిత్రాల్లోనే ఎక్కువగా నటించా. ఆ శైలికి భిన్నంగా ఇరవై ఐదో సినిమా చేయాలనే ఆలోచనతో ఈ కథను ఎంచుకున్నా. రజనీకాంత్ నటించిన ‘బాషా’ చిత్రాన్ని ప్రేరణగా తీసుకొని హాకీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించాం. ఐకమత్యమే బలమని సినిమాలో మేము చెప్పిన పాయింట్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు’ అన్నారు. రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ ‘స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చక్కటి ఎమోషన్స్‌తో మంచి సినిమా చేయొచ్చని నిరూపించింది. జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇది. కరణం మల్లీశ్వరి బయోపిక్‌ను తెరకెక్కించేలా నాలో ధైర్యాన్ని నింపింది’ అన్నారు. సక్సెస్‌ను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నామని, డిస్ట్రిబ్యూటర్లందరూ సేఫ్ అయ్యారని నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- A1 Express
- Sundeep Kishan
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

