కొత్త జంట కథ
నిర్మాత ఎం.ఎస్.రాజు ‘డర్టీహరి’ చిత్రంతో దర్శకుడిగా విజయాన్ని ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘7డేస్ 6 నైట్స్’ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘సతి’ పేరుతో కొత్త సినిమా తెరకెక్కుతున్నది. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ జంటగా నటిస్తున్నారు. మంగళవారం ఎం.ఎస్.రాజు పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘కొత్తగా పళ్లైన జంట మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన భావోద్వేగభరితమైన కథ ఇది. వినూత్నమైన ఇతివృత్తంతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాకేష్ హాసమని, వెంకట్, నిర్మాణ సంస్థలు: వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, రమంత క్రియేషన్స్, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రఘరామ్, టి.సారంగ సురేష్ కుమార్, రవి దాట్ల, కథ, దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

