Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Sukumar | సినిమా అంటేనే భావోద్వేగాల ప్రపంచం. కొన్ని కథలు ప్రేక్షకులను నవ్విస్తే.. మరికొన్ని కంటతడి పెట్టిస్తాయి. తాజాగా అలాంటి ఓ ఎమోషనల్ సినిమాను చూసి దర్శకుడు సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే ఇందులో విశేషం ఏమిటంటే.. సుకుమార్‌ను ఆ సినిమా చూసేలా చేయడమే కాకుండా, ఆయనతో ఏకంగా ఓ పందెం కూడా కాశారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఏడిస్తే లక్ష రూపాయలు ఇవ్వాలని, ఏడవకుండా బయటకు వస్తే కోటి రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ విసిరారు.
Sukumar | సినిమా అంటేనే భావోద్వేగాల ప్రపంచం. కొన్ని కథలు ప్రేక్షకులను నవ్విస్తే.. మరికొన్ని కంటతడి పెట్టిస్తాయి. తాజాగా అలాంటి ఓ ఎమోషనల్ సినిమాను చూసి దర్శకుడు సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే ఇందులో విశేషం ఏమిటంటే.. సుకుమార్‌ను ఆ సినిమా చూసేలా చేయడమే కాకుండా, ఆయనతో ఏకంగా ఓ పందెం కూడా కాశారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఏడిస్తే లక్ష రూపాయలు ఇవ్వాలని, ఏడవకుండా బయటకు వస్తే కోటి రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ విసిరారు. చివరకు ఈ పందెంలో సుకుమార్ ఓడిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విడుదలైన తర్వాత ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాను చూడాలని దర్శకుడు సుకుమార్‌కు అల్లు అరవింద్ సూచించారు. అంతేకాదు, సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా థియేటర్ నుంచి బయటకు వస్తే కోటి రూపాయలు ఇస్తానని, ఒకవేళ ఏడిస్తే మాత్రం సుకుమార్ తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని పందెం కాశారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన సుకుమార్ సినిమా చూశారు. అయితే చిత్రంలోని భావోద్వేగ సన్నివేశాలకు ఆయన కూడా కంటతడి పెట్టుకున్నారట. దీంతో పందెంలో ఓడిపోయి అల్లు అరవింద్‌కు లక్ష రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.
ఈ ఆసక్తికర విషయాన్ని స్వయంగా సుకుమారే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అల్లు అరవింద్ తనకు ఫోన్ చేసి ఈ ఛాలెంజ్ విసిరినట్లు చెబుతూ, సినిమా చూసిన తర్వాత తన అనుభవాన్ని పంచుకున్నారు. అంతేకాదు, అల్లు అరవింద్ పేరు మీద రాసిన లక్ష రూపాయల చెక్ ఫొటోను కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఈ సినిమా కోసం చేసిన సిఫార్సు ఎంతో విలువైనదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, పందెంలో ఓడిపోయిన సుకుమార్‌కు ధన్యవాదాలు చెబుతూ గీతా ఆర్ట్స్ సంస్థ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
Looks like Aravind garu has to send some tissues as well…😄❤️
#AlluAravind garu has a playful bet with Director #Sukumar about #AakasamloOkaTara ⭐️
And Sukumar garu lost after becoming emotional watching #AOT 😄❤️ https://t.co/ID9d9ILlB0— Maduri Madhu (@madurimadhu1) November 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

