విజయ్‌శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫోకస్’. అషూరెడ్డి నాయిక. జి.సూర్యతేజ దర్శకుడు. రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మాణంలో, స్కైరా క్రియేషన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి.
మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో, ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వుంటుంది. సుహాసిని మణిరత్నం చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు’ అన్నారు.