Student Drives Tractor | అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటాయి. కానీ ఏలాంటి వీడియో అయిన వైరల్ అవ్వలంటే అది సోషల్ మీడియానే అని చెప్పక తప్పదు. అయితే ఇప్పుడున్న టీనేజ్ యువత చేసే పనులు సాధారణంగా నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే సోషల్ మీడియాలో జరిగింది.
తమిళనాడు రాష్ట్రం నల్లూరులోని జయరాజ్ అన్నపాకియం కాలేజీలో చదువుతున్న ఓ స్టూడెంట్ కాలేజ్‌కి ఏకంగా ట్రాక్టర్ తీసుకువచ్చాడు. కాలేజ్ అయిపోయిన అనంతరం ఆ స్టూడెంట్ ట్రాక్టర్ తోలుకుంటూ వెళ్లగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక వీడియో చూసిన నెటిజెన్లు ”ఎవరు బాబు నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు”, “ట్రాక్టర్ వేసుకొని వచ్చి ఎలెవషన్స్ ఇచ్చావ్ చూడు తమ్ముడు నువ్వు తోపు అంతే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Tractor esuku vacchesav entra😂😝😜 pic.twitter.com/4KIQxz7P1x
— Poley_Adiripoley (@poleyadiripoley) August 3, 2023