రాష్ట్ర ప్రదాత కేసీఆర్
- ముఖ్యమంత్రి సందర్భంగా..సంబురాలు, హరితహారం
తెలంగాణ జాతిపిత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో కనుల పండువగా నిర్వహించారు. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, అన్నదానాలు, పండ్ల పంపిణీ , ఆలయాల్లో ప్రత్యేక పూజలతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం కనిపించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సోమాజిగూడ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వరకాలనీ డివిజన్లోని పంజాగుట్టలో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లో శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాల్లో పాల్గొన్నారు. అనంతరం లోటస్ పాండ్ పార్కులో మేయర్ మొక్కలు నాటారు. – బంజారాహిల్స్/ ఖైరతాబాద్/ హిమాయత్నగర్,ఫిబ్రవరి 17
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

