టాలెంట్ సెర్చ్

న్యూఢిల్లీ, జనవరి 25: నిపుణుల కోసం ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు తీవ్రంగా అన్వేషిస్తున్న నేపథ్యంలో స్టార్టప్ కంపెనీలు కూడా ఇదే బాటపట్టాయి. నైపుణ్యంగల యువతను నియమించుకోవడం స్టార్టప్ వ్యవస్థాపకులకు ఓ సవాలుగా మారింది. ఈ కారణంగా వచ్చే 12 నెలల్లో టాలెంట్‌ను రిక్రూట్ చేసుకుని, నిపుణులను సంస్థలో నిలుపుకోవడానికే తాము అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఒక తాజా సర్వేలో స్టార్టప్ వ్యవస్థాపకులు వెల్లడించారు. గతేడాదికాలంగా స్టార్టప్‌లు రికార్డుస్థాయిలో నిధులు సమీకరించి, వేగంగా వృద్ధిచెందే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో 100 స్టార్టప్ ఫౌండర్లతో డెట్ ఫండ్ ఇన్నోవెన్ క్యాపిటల్ ఒక సర్వే నిర్వహించింది.
- మంచి టాలెంట్‌ను రిక్రూట్ చేసుకోవడం పెద్ద సవాలుగా ఉందని 39 శాతం ప్రతినిధులు తెలిపారు.
- వచ్చే 12 నెలల్లో నిపుణుల సంఖ్యను పెంచడం తమ ప్రాధాన్యత అని 27 శాతం మంది అభిప్రాయపడ్డారు. నిధుల సమీకరణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు 23 శాతం మంది తెలిపారు.
- తమ ముందున్న పెద్ద సవాళ్లు నియంత్రణాపరమైనవని 17 శాతం మంది, నిధుల సమీకరణ భారీ సవాలుగా మారిందని 15 శాతం వ్యవస్థాపకులు వెల్లడించారు.
- 2021కంటే 2022లో నియామకాలు పెంచుతామని సర్వేలో పాల్గొన్నవారిలో మూడు వంతుల మంది చెప్పారు. ఇందులో 48 శాతం మంది గతేడాదికంటే రిక్రూట్మెంట్లను గణనీయంగా పెంచుతామన్నారు.
- ఆగ్రిటెక్, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, డీ2సీ స్టార్టప్‌లు నియామకాల్లో జోరు పెంచనున్నాయి.
- మహిళలకు ప్రాధాన్యత పెంచే అంశం స్టార్టప్‌లకు సవాలుగా ఉంది. 20 శాతానికి పైగా మహిళలు లీడర్షిప్ హోదాల్లో ఉన్నారని 30 శాతం స్టార్టప్‌లు తెలిపాయి. గతేడాది సర్వేలో 33 శాతం స్టార్టప్‌ల్లో 20 శాతానికి పైగా మహిళలు ఈ హోదాలో ఉన్నారు.
- సర్వేలో పాల్గొన్న స్టార్టప్‌ల్లో 54 శాతం కంపెనీలు వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రీడ్ మోడల్‌ను అనుసరిస్తుండగా, 46 శాతం వర్క్ ఫ్రం ఆఫీస్‌ను అమలు చేస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

