పాలసీదారులకు మెరుగైన సేవలను సులభంగా అందించేందుకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.. వాట్సాప్ ద్వారా సేవలను ప్రారంభించింది. కొత్త పాలసీని కొనడం నుంచి పాలసీ క్లెయిం వరకు అన్ని సేవలను ఈ సోషల్ మీడియా యాప్ ద్వారా పొందవచ్చు. దీనికి చేయాల్సిందల్లా 95976 52225 నంబర్‌కు హాయ్ అంటూ వినియోగదారులు తమ వాట్సాప్ మొబైల్ నంబర్ ద్వారా మెసెజ్ పంపిస్తే చాలు. క్యాష్‌లెస్ క్లెయిం, పాలసీ డాక్యుమెంట్ల డౌన్లోడ్, కొత్త పాలసీని కొనుగోలు చేయడం తదితర సేవలను పొందవచ్చు. వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్టార్ హెల్త్ హామీ ఇస్తున్నది. వాట్సాప్ మెసేజ్‌లతోపాటు ట్వింకిల్, కస్టమర్ కేర్ నంబర్, ఏజెంట్లు, స్టార్ హెల్త్ వెబ్సైట్, బ్రాంచ్ ఆఫీసులు, స్టార్ పవర్ యాప్ తదితర మార్గాల్లో కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సేవలను పొందవచ్చు.