మనకు ఎదురయ్యే ఏ పరిచయం కూడా యాదృచ్ఛికం కాదు. ప్రతి పరిచయానికి ఓ కారణం వుంటుంది అనే కథా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘సోల్స్’. త్రినాథ్ వర్మ, భావన సాగి జంటగా నటించారు. శ్రావణ్ దర్శకుడు. విజయలక్ష్మి వేలూరి నిర్మాత. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు వెంకటేష్ మహా విడుదల చేశారు. రెండు సోల్స్ మధ్య జరిగే ప్రయాణమిదని దర్శకుడు తెలిపారు.