బిగ్‌బాస్ ఫేమ్ సొహైల్, మోక్ష జంటగా ఏ.ఆర్.అభి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లక్కీ లక్ష్మణ్’ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా పతాకాలపై హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘చుట్టూ ఉన్న వారంతా లక్కీఫెలో అంటున్నా..తాను మాత్రం ఎప్పటికీ దురదృష్టవంతుడనని ఫీలయ్యే యువకుడి కథ ఇది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, సంగీతం: అనూప్‌రూబెన్స్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: ఏఆర్ అభి.