కమల్ కామరాజు, అపర్ణాదేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా..’. రఘుపతి రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విజయ్‌కుమార్ పైండ్ల నిర్మాత. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘భావోద్వేగభరితంగా సాగే కుటుంబ కథా చిత్రమిది. స్త్రీ సమస్యలను చర్చిస్తుంది.
సమాజంలోని వాస్తవికతను ప్రతిబింబిస్తూ కథ సాగుతుంది’ అన్నారు. కాలకేయ ప్రభాకర్, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోహన్ చారి, సంగీతం: వర్ధన్, రచన-దర్శకత్వం: రఘపతి రెడ్డి గుండా.