ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్‌ఖాన్ పాము కాటుకు గురయ్యారు. ముంబయికి సమీపంలోని పన్వేల్ ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆయన్ని వెంటనే ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషంలేని పాము కాటువేయడంతో ప్రమాదం తప్పిందని, ప్రాథమిక చికిత్స చేసి.. ఆరు గంటల పర్యవేక్షణ అనంతరం సల్మాన్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. ఫామ్‌హౌస్‌లోని పచ్చికమీద కూర్చొని మిత్రులతో మాట్లాడుతుండగా సల్మాన్‌ఖాన్ పాము కాటుకు గురయ్యారని తెలిసింది. సోమవారం తన జన్మదిన వేడుకల నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. గత కొన్నేళ్లుగా మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో తన ఫామ్‌హౌస్‌లోనే పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నారు.