అపోహలు తొలగిపోతాయి

‘కుటుంబ కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. నేటితరం యువత అభిరుచులకు అద్దంపడుతూ నవ్యానుభూతిని పంచుతుంది’ అని అన్నారు ఉదయ్‌కిరణ్. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. సాయిరోనక్, నేహాసోలంకి జంటగా నటించారు. సురేష్శేఖర్ రేపల్లే దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా సంగీతదర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ ‘ఇందులో పంచభూతాల్లాంటి ఐదు అద్భుతమైన పాటలు కుదిరాయి. మాస్, ఫోక్ శైలి పాటలు నాకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. వాటికి భిన్నంగా మెలోడీ ప్రధానంగా ఇందులోని పాటల్ని స్వరపరిచా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో నాపై ఉన్న అపోహలు ఈ సినిమాతో తొలగిపోతాయి. సురేష్ గంగుల, దేవ్పవార్ అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా తరహాలో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘బ్లాక్ అండ్ వైట్’, ‘ప్రియుడు’ తర్వాత నేను నిర్మించిన చిత్రమిది. వినూత్న ప్రేమకథతో తెరకెక్కించాం. అశ్లీలత, అసభ్యతకు తావులేకుండా క్లీన్‌ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరిస్తుంది. దుబాయ్‌లో చిత్రీకరించిన పాటలు ఆకట్టుకుంటాయి. దాదాపు రెండు వందల థియేటర్స్‌లో విడుదలచేస్తున్నాం ’ అని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

