సిన్సియర్ పోలీస్ కహానీ
కొత్తదనంతో కూడిన కథలకు చిరునామాగా నిలుస్తున్నారు యువహీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్వర్మ దర్శకుడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీలుక్‌ను మంగళవారం అగ్రహీరో రవితేజ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో శ్రీవిష్ణు సిన్సియర్ పోలీసాఫీసర్ ఎ.ఎస్.రామరాజుగా కనిపిస్తారు. ఆయన పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని మలుపులు ఆసక్తినిరేకెత్తిస్తాయి. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృథ్వీరాజ్, రవివర్మ, మధుసూధన్‌రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌తోట, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, బెక్కెం బబిత, రచన-దర్శకత్వం: ప్రదీప్ వర్మ.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

