కరోనా సమయంలో విహారయాత్ర.. శృతి స్పందన ఏంటంటే!

కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తుంది. దేశ వ్యాప్తంగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆక్సీజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల లాక్డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నారు. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇవన్నీ పట్టనట్టు కొందరు సెలబ్రిటీలు మాత్రం ఎంచక్కా విహారయాత్రలకు వెళుతున్నారు. విహారయాత్రలకు వెళ్లే వాళ్లకు హక్కు, డబ్బు ఉన్నప్పటికీ ఇలాంటి టైమ్ లో అలాంటి పనులు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదంటోంది శృతిహాసన్.
ఇది చాలా కఠిన సమయం. ఇలాంటి సమయంలో కొందరు విహారయాత్రలకు వెళ్లడం భావ్యంగా లేదు. మనల్ని అభిమానించే అభిమానులు కష్టాలలో ఉన్నప్పుడు మనం పార్టీలు చేసుకోవడం, విహారయాత్రలకు వెళ్లడం మంచి పద్దతి కాదని అంటుంది శృతి హాసన్. నా వంతుగా ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి సమాచారాన్నైనా షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. ఈ విషయాలను రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. కాగా, ఓ వైపు కరోనాతో దేశమంతా వణికిపోతుంటే రణబీర్, అలియా, జాన్వి, సారా, దిశా పటానీ లాంటి సెలబ్రిటీలు హాలీడేస్‌కి వెళ్లడంపై నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

