ఒక్క సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటున్న కింగ్ ఖాన్!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పైకి వస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న పఠాన్ మూవీలో అతడు ఓ సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని చాలా వరకు సీక్రెట్‌గా చిత్రీకరిస్తున్న సినిమా యూనిట్.. చాలా వరకూ విషయాలను బయటకు లీక్ చేయడం లేదు. అయితే ఈ మధ్యే ఈ మూవీలో తానో గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు సల్మాన్ ఖాన్ చెప్పాడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుండగా.. తాజాగా లీకైన ఓ విషయం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
ఈ మూవీ కోసం కింగ్ ఖాన్ ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని చిత్ర వర్గాలు ఇప్పటి వరకూ ధృవీకరించలేదు. అయితే 2018లో జీరో తర్వాత వస్తున్న షారుక్ ఖాన్ మూవీ ఇదే కావడంతో ఈ భారీ రెమ్యునరేషన్ నిజమే కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2022లో పఠాన్ మూవీ రిలీజ్ కానుంది. గతేడాది నవంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో ఫిమేల్ లీడ్‌గా దీపికా పదుకోన్ నటిస్తుండగా, జాన్ అబ్రహం కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

