Shaheen Afridi: తొలి ఓవర్లోనే 4 వికెట్లు తీసిన షాహీన్ అఫ్రిది. .కానీ
Shaheen Afridi: షాహీన్ అఫ్రిది దడదడలాడించాడు. తొలి ఓవర్లోనే తన ఖాతాలో 4 వికెట్లు వేసుకున్నాడు. టీ20 బ్లాస్ట్ టోర్నీలో బర్మింగ్హామ్ బ్యాటర్లను చకచకా పెవిలియన్ పంపించేశాడు. కానీ నాటింగ్హామ్ జట్టు మాత్రం 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ట్రెంట్ బ్రిడ్జ్: పాకిస్థాన్ పేస్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ(Shaheen Afridi) తన స్పీడ్తో దుమ్మురేపినా.. టీ20 విటాలిటీ బ్లాస్ట్ టోర్నీలో తన జట్టు నాటింగ్హామ్ షైర్ను గెలిపించలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హామ్షైర్ నిర్ణీత ఓవర్లలో 168 రన్స్ చేసింది. అయితే 169 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన బర్మింగ్హామ్ బియర్స్ జట్టుకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగలింది. నాటింగ్హామ్ బౌలర్ షాహీన్ అఫ్రిది తన తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లును ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్ అలెక్స్ డేవిస్(0), క్రిస్ బెంజిమన్(0), డాన్ మౌజ్లే(1), ఎడ్ బెర్నార్డ్(0) వికెట్లను తీసుకున్నాడు. కానీ మరో ఓపెనర్ రాయ్ యేట్స్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. యేట్స్ 46 బంతుల్లో 65 రన్స్ చేశాడు. దీంతో మరో 5 బంతులు ఉండగానే బర్మింగ్హామ్ జట్టు లక్ష్యాన్ని అందుకున్నది. తొలి ఓవర్లోనే 4 వికెట్లు తీసిన షాహీన్ అఫ్రిది వీడియో ఇదే.
Shaheen Afridi, you cannot do that!! 💥 https://t.co/ehXxmtz6rX pic.twitter.com/wvibWa17zA
— Vitality T20 Blast (@VitalityBlast) June 30, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

