Shaakunthalam Movie | ఫ్లాప్ సినిమాకు నాలుగు ఇంటర్నేషనల్ అవార్డులు.. కేన్స్‌లో సత్తా చాటిన శాకుంతలం సినిమా
Cannes Film Festival Awards | ఆరు వారాల క్రితం ఎన్నో అంచనాల మధ్య రిలీజైన 'శాకుంతలం' తొలిరోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దిల్‌రాజు సైతం తన పాతికేళ్ల సినిమా కెరీర్లో శాకుంతలం ఓ పెద్ద జర్క్ ఇచ్చిందని చెప్పాడు.
Cannes Film Festival Awards | ఆరు వారాల క్రితం ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘శాకుంతలం’ తొలిరోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దిల్‌రాజు సైతం తన పాతికేళ్ల సినిమా కెరీర్లో శాకుంతలం ఓ పెద్ద జర్క్ ఇచ్చిందని చెప్పాడు. ఇక ఈ సినిమా తెచ్చిపెట్టిన నష్టాలు అంతా ఇంతా కాదు. వీఎఫ్ఎక్స్ కైన్ మాస్టర్ ఆప్‌లో చేసినట్లుందని, యాక్టర్లు సహజంగా నటించలేరని, స్క్రీన్‌ప్లే చాలా స్లోగా ఉందని.. ఇలా బోలెడు విమర్శలు వచ్చాయి. అసలు ఇది గుణశేఖర్ సినిమానేనా అనే డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. ఇక నెల తిరక్కుండానే ఓటీటీ బాట పట్టింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. చాలా మంది ప్రేక్షకులు పని గట్టుకుని మరీ సినిమా బాలేదని పోస్ట్‌లు వేశారు.
ఇక ఇదిలా ఉంటే ఇన్నీ విమర్శల మధ్య చిత్రబృందం సంతోషించే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. కాగా ఈ వేడుకలలో శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో శాకుంతలం సినిమా నాలుగు అవార్డులను గెలుచుకుంది. గతంలో ఈ సినిమాకు న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ కేటగిరిల్లో రెండు అవార్డులను గెలుచుకుంది.
ఇలా కమర్షియల్‌గా నష్టాలు మిగిల్చిన శాకుంతలం అవార్డుల్లో మాత్రం సత్తా చాటుతుంది. కాళీదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలకపాత్రలో నటించాడు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గెస్ట్ రోల్లో మెప్పించింది.
Few more wins pic.twitter.com/Lst0sYCzU1
— Gunaa Teamworks (@GunaaTeamworks) May 28, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

