పెండ్లికాని అమ్మాయితో సెక్స్‌పై అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్య
ప్రయాగ్‌రాజ్, అక్టోబర్ 30: మేజర్ అయి ఉండి పెండ్లి కాని అమ్మాయితో పరస్పర అంగీకారంతో జరిగే సెక్స్ నేరం కాకపోయినప్పటికీ భారత సంప్రదాయాల ప్రకారం అది నీతి బాహ్యమైనది, అనైతికమైనది అని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. ఓ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడికి బెయిల్ తిరస్కరించింది. యూపీలోని కోశాంబిలో ఫిబ్రవరిలో ఓ బాలిక తన బాయ్ ఫ్రెండ్ రాజుతో బయటికి వెళ్లినప్పుడు గ్యాంగ్ రేప్ జరిగింది. బాలిక తన బాయ్ ఫ్రెండ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులపై కేసు పెట్టింది. ఈ కేసులో రాజు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొన్నాడు. దీనిపై విచారణ సందర్భంగా కోర్టు… ‘తన గర్ల్ ఫ్రెండ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అబ్బాయిపై ఉంది. కానీ ఈ కేసులో తను ప్రేమించిన అమ్మాయిపై ముగ్గురు పాశవికంగా దాడి చేస్తుంటే అబ్బాయి ప్రేక్షకుడిలా ఉండిపోయాడు. ఇది శోచనీయం’ అని వ్యాఖ్యానించింది. రాజుకు బెయిల్ తిరస్కరించింది.