లక్షలాది మందికి ప్రేరణగా నిలిచావు.. ఫెదరర్ రిటైర్మెంట్పై సెరీనా కామెంట్
Roger Federer retirement: లెజెండ్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ గురువారం టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫెదరర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరో లెజెండరీ ప్లేయర్ సెరీనా విలియమ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. రిటైర్మెంట్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పిన ఆమె.. ఫెదరర్ కీర్తిని చాటారు. ఎప్పుడూ ప్రతి విష
హైదరాబాద్: లెజెండ్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ గురువారం టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫెదరర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరో లెజెండరీ ప్లేయర్ సెరీనా విలియమ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. రిటైర్మెంట్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పిన ఆమె.. ఫెదరర్ కీర్తిని చాటారు. ఎప్పుడూ ప్రతి విషయంలోనూ ఫెదరర్‌ను ప్రేరణగా తీసుకున్నట్లు సెరీనా చెప్పారు. వచ్చే వారం లండన్‌లో జరగనున్న లావెర్ కప్ తర్వాత స్విస్ లెజెండ్ ఫెదరర్ రిటైర్‌కానున్నట్లు వెల్లడించారు. ప్రతి విషయంలోనూ నిన్నే ఫాలో అయ్యానని, నిన్ను ఎంతోగానే అభిమానించినట్లు సెరీనా తన పోస్టులో పేర్కొన్నది. మనం ఎంచుకున్న మార్గాలు ఒకేరకమైనవని, దాదాపు ఒకేరకంగా ఉండేవన్నారు. ఎన్నో లక్షల మందికి ప్రేరణగా నిలిచావని, నేను కూడా నిన్నే ప్రేరణగా తీసుకున్నానని, నిన్నెన్నటికీ మరిచిపోలేనని సెరీనా తన పోస్టులో తెలిపింది. రిటైర్మెంట్ క్లబ్‌కు స్వాగతం పలికిన సెరీనా.. భవిష్యత్తులో నువ్వే చేయబోయే ప్రతి అంశాన్ని ఫాలోకానున్నట్లు ఆమె ఫెదరర్‌ను ప్రశంసించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

