న్యూయార్క్: టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్ కెరీర్ దాదాపు ముగిసింది. యూఎస్ ఓపెన్ మూడవ రౌండ్లో సెరీనా 7-5, 6-7, 6-1 స్కోర్ తేడాతో అజ్లా టామ్జానోవిక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో సెరీనా సుదీర్ఘ కెరీర్‌కు ఫుల్స్టాప్ పడింది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన సెరీనా .. గ్రేటెస్ట్ చాంపియన్‌గా టెన్నిస్ క్రీడ నుంచి నిష్క్రమించింది. ఇదే తన చివరి టోర్నీ అని గతంలో సెరీనా ప్రకటించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల ఆస్ట్రేలియా క్రీడాకారిణి టామ్జానోవిక్ తొలి సెట్లో దూకుడు ఆటను ప్రదర్శించింది. రెండవ సెట్‌ను అతి కష్టంగా నెగ్గిన సెరీనా.. ఇక మూడవ సెట్లో మాత్రం చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ దాదాపు 83 నిమిషాల పాటు సాగింది.