ఎస్సీ జేఏసీ ఆవిర్భావం.. చైర్మన్‌గా భైరి వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక
షెడ్యూల్డ్ కులాల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిపోరు సాగించేందుకు, షెడ్యూల్డ్ కులాల ఐక్యత సాధనలో భాగంగా పలు ఎస్సీ కుల సంఘాలన్నీ కలిసి జేఏసీగా (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆవిర్భవించాయి.
- 20శాతం రిజర్వేషన్ల సాధనకోసం ఏకమైన ఎస్సీ కులసంఘాలు..
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్డ్ కులాల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిపోరు సాగించేందుకు, షెడ్యూల్డ్ కులాల ఐక్యత సాధనలో భాగంగా పలు ఎస్సీ కుల సంఘాలన్నీ కలిసి జేఏసీగా (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆవిర్భవించాయి. జేఏసీ చైర్మన్‌గా ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వెంకటేశం ఏకగ్రవంగా ఎన్నికయ్యారు. జేఏసీ సమావేశం హైదరాబాద్‌లోని సామ్రాట్ భవన్లో ఆదివారం జరిగింది. సమావేశంలో షెడ్యూల్డ్ కులాలు ఎదురొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీల సమస్యలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని జేఏసీ వరింగ్ ప్రెసిడెంట్ తీగల అశోక్‌కుమార్ ప్రకటించారు. జేఏసీ చైర్మన్‌గా భైరి వెంకటేశం, గౌరవ సలహాదారుగా పీ శంకర్, ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షుడిగా రేపల్లె నాగన్న, కో కన్వీనర్‌గా పోతగల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చలిచీమల మల్లేశ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అడ్డాల నరేశ్‌తోపాటు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కో ఆర్డినేటర్, కో కన్వీనర్లు, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

