బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) .. ఎవరికైనా వ్యక్తులు లేదా సంయుక్తంగా బంగారం కోనం దరఖాస్తు చేసుకున్న వారికి పలు రాయితీలు కల్పిస్తున్నది. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి రుణ పరపతినిస్తున్నది. బ్యాంకులు విక్రయించే బంగారం నాణాలతోపాటు ఆభరణాల కొనుగోళ్లకు ఈ రుణం తీసుకోవచ్చు. బంగారం కోసం రుణం తీసుకునే బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి గుర్తింపు కార్డులు జత చేయవసరం లేదు. ఎస్బీఐ యాప్ యోనో ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపునిస్తున్నది.
రుణాలకు దరఖాస్తు అర్హతలు ఇవే:
- ప్రతి 18 ఏండ్లు దాటిన వ్యక్తి ఈ స్కీమ్ కింద బంగారం రుణం కోసం దరఖాస్తు చేయొచ్చు.
- బ్యాంకు ఉద్యోగులు లేదా పెన్షనర్లతోపాటు ఎవరైనా ఆదాయ వనరులు చెప్పాలి. (ఆదాయం ఆధారాలు చూపనవసరం లేదు)
ఎస్బీఐ గోల్డ్ లోన్ ఫీచర్లు ఇవే:
- గరిష్ఠ రుణ మొత్తం :రూ.50 లక్షలు
- కనిష్ఠ రుణ మొత్తం :రూ.20 వేలు
బంగారంపై ఇచ్చే రుణానికి ఎస్బీఐ తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది. రుణ మొత్తంలో 0.25 శాతం వడ్డీతోపాటు కనీసంగా జీఎస్టీ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.
బంగారం ఆభరణాలు భద్రత కల్పిస్తాయి. రుణ చెల్లింపులు పూర్తయిన తర్వాత మన చేతికి వస్తాయి. ఈ రుణంతో ఎవరికీ నష్టం లేదు.
మార్జిన్లు:
గోల్డ్ లోన్: 25%
లిక్విడ్ గోల్డ్ లోన్: 25%
బుల్లెట్ రీపెమెంట్ గోల్డ్ లోన్:35%
గోల్డ్, లిక్విడ్ గోల్డ్ లోన్లు మూడేండ్లలోనూ, బుల్లెట్ పేమెంట్ గోల్డ్ లోన్ 12 నెలల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.
అన్ని రకాల బంగారం రుణాలపై 7.5 శాతం వడ్డీ వసూలు చేస్తుంది ఎస్బీఐ. అయితే రియాల్టీ గోల్డ్ లోన్ పథకం కింద ఇంటి కోసం బంగారం రుణం తీసుకునే వారికి 7.3 శాతం వడ్డీ అమలు చేస్తున్నది. మిస్డ్ కాల్ ఇచచినా, ఎస్ఎంఎస్ పంపినా ఎస్బీఐ గోల్డ్ లోన్ మంజూరవుతుంది. ఎస్బీఐ గోల్డ్ లోన్ సమాచారం కోసం 7208933143 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ కానీ, 7208933145 అనే నంబర్‌కు గోల్డ్ అని ఎస్సెమెస్ పంపాల్సి ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

