ఈ లోకంలో చెడ్డవాళ్లు హాయిగా ఉంటున్నారు, మంచివాళ్లకే కష్టాలు అనుకుంటూ ఉంటారు. చిలుకను పంజరంలో పెట్టి సాకుతారే కానీ, కాకులను కాదు. అందమైన పక్షికి బంధనం ఉంటుంది. అలాగే దుర్మార్గులకు ఎలాంటి బంధనాలు ఉండవు. సన్మార్గులకే బంధనాలు, పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అయితే, మనసులో దైవాన్ని నింపుకొన్న వ్యక్తికి ఈ బంధనాలన్నీ తొలగిపోతాయి. భగవత్ భావం హృదయంలో ఉన్నంత వరకు ఏ కష్టాలు ఏమీ చేయలేవు. అల్పబుద్ధి, సంకుచితమైన భావం, అహంకారం, ద్వేషం కలిగిన దుష్టబుద్ధులు దైవానుగ్రహం పొందలేరు.
l పుట్టపర్తి సత్యసాయిబాబా