సారంగదరియా..ఇపుడు సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడ చూసినా ఇదే పాట. లవ్‌స్టోరీ చిత్రం నుంచి మంగ్లీ పాడిన ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తోంది. సారంగదరియా పాటకు యూట్యూబ్‌లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలో 50 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి పాటగా ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.
విలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చే ఈ పాటకు సాయిపల్లవి వేసిన స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం లవ్‌స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సారంగదరియా పాటను సుద్దాల అశోక్ తేజ రాశారు. లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.