ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తాజాగా ఫోటోషూట్ చేసింది. ఆ క్యూటీ తన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసింది. వైట్ డ్రెస్‌లో సారా మెరిసిపోతోంది. కొన్ని ఫోటోలతో పాటు ఓ వీడియోను కూడా స్టోరీలో అప్లోడ్ చేసింది. స్మైలీ ట్యూస్‌డేస్ అన్న ట్యాగ్‌తో ఆ ఫోటోలను పోస్టు చేసింది. సారా ఇన్‌స్టాలో ఇటీవల దిగిన బోలడన్ని బ్యూటీఫుల్ ఫోటోలు ఉన్నాయి. వెడ్డింగ్ లుక్ డ్రెస్సులో సారా తెగ అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో తన ఫ్రెండ్ వెడ్డింగ్‌కు సారా హాజరైంది. ఆ పెళ్లికి సారా వేసుకున్న డ్రెస్ అందర్నీ స్టన్ చేసింది.