ఇటీవల విడుదలైన ‘కేజీఎఫ్-2’ చిత్రంలో అధీరా పాత్రలో భయంకరమైన విలనీ పండించి అందరిని మెప్పించారు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్. ఆయన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా సంజయ్‌దత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా నటుడిగా తనకు కొత్త ఉత్తేజాన్ని అందించిందన్నారు. ‘ కంఫర్ట్‌జోన్ దాటుకొని వెళితే అద్భుతాలు సృష్టించవొచ్చని ఈ సినిమా నిరూపించింది. నా నిజమైన బలాల్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ సక్సెస్ క్రెడిట్‌ను దర్శకుడు ప్రశాంత్నీల్కే ఇస్తాను. ఆయన కలల్ని మేమంతా తెరపై ఆవిష్కరించాం. జీవితం ఒక్కోసారి సవాళ్ల రూపంలో మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ‘కేజీఎఫ్-2’లో నేను పోషించిన అధీరా పాత్ర అలాంటిదే’ అని సంజయ్‌దత్ పేర్కొన్నారు.