కలలోనూ అనుకోలేదు..
టాలీవుడ్లో సందడి చేస్తున్న మలబారు అందం సంయుక్త మీనన్. అందం, అభినయంతో తెలుగువారికి చేరువైన ఈ మలయాళ సోయగం.. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కెరీర్లో దూసుకుపోతున్నది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన సంయుక్త ‘బింబిసార’, ‘విరూపాక్ష’లతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం అఖండ 2లో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంయుక్త పంచుకున్న కబుర్లు ఇవి..
టాలీవుడ్లో సందడి చేస్తున్న మలబారు అందం సంయుక్త మీనన్. అందం, అభినయంతో తెలుగువారికి చేరువైన ఈ మలయాళ సోయగం.. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కెరీర్లో దూసుకుపోతున్నది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన సంయుక్త ‘బింబిసార’, ‘విరూపాక్ష’లతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం అఖండ 2లో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంయుక్త పంచుకున్న కబుర్లు ఇవి..
నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా ‘బ్లాక్ గోల్డ్’. యాక్షన్, ఎమోషనల్, ఇంటెన్సిటీ, హృదయాన్ని తాకే క్షణాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రయాణమిది. నాది ఈ సినిమాలో లీడ్ రోల్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఉంటుంది.
నేను కేరళలోని అందమైన గ్రామంలో పుట్టాను. అది తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉండేది. ఆ మారుమూల పల్లెలో పుట్టిన నాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచన కలలో కూడా రాలేదు. బాగా చదువుకొని డాక్టరు కావాలని అనుకునేదాన్ని. బడిలో చదువుకునే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. పుస్తకాలు చదవడంతో పాటు వేదాల గురించి కూడా కాస్త తెలుసుకున్నా.
ఒకసారిపాలక్కాడ్లో బ్యుటీషియన్స్ కోసం నిర్వహించిన మేకప్ సెమినార్ జరిగింది. దానికి ఎంపిక చేసిన మాడల్ రాలేదు. దీంతో మా అమ్మ బలవంతం మీద ఆ రోజు మాడల్‌గా నేను చేయాల్సి వచ్చింది. నా లుక్ బాగుండటంతో అందరూ మాడలింగ్ కొనసాగించమని సూచించారు.కొన్నాళ్లకు ఓనమ్ రోజు తీసుకున్న ఫొటోలు ఓ మ్యాగజైన్లో పబ్లిష్ అయ్యాయి. అప్పటినుంచే సినిమా అవకాశాలు వచ్చాయి.
విరూపాక్ష సినిమా సమయంలో కరోనా వల్ల ఒకనెల ఖాళీ సమయం దొరికింది. ఆ టైంలోనే తెలుగు నేర్చుకున్నా. రెండు వాక్యాలతో మొదలుపెట్టి తెలుగు భాష మీద పట్టు సాధించా. ఇప్పుడు డైలాగులు బాగా చెప్పగలుగుతున్నా. తెలుగు మాట్లాడేకొద్దీ మాట్లాడాలనిపిస్తుంటుంది.
చేస్తున్న పనిని ప్రేమించడం నా నైజం. ఇష్టమైన పని చేసేటప్పుడు ప్రతీ క్షణం ఆనందం పొందుతాను. రోజంతా షూటింగ్లో అలిసిపోయినా కూడా జిమ్ చేసి ఇంటికి వచ్చి పెంపుడు కుక్కలతో ఆడుకునే వరకూ అలసట అనిపించదు. వాటినీ మా కుటుంబ సభ్యుల్లో ఒక్కరుగానే చూస్తా.
నాకు సంప్రదాయాలు, వేదాలు, పురాణాలు అంటే చాలా ఆసక్తి. ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. శివుడి మీద భక్తితో ‘శైవ కశ్మీర్ స్కూల్’లో కశ్మీర్ శైవిజం గురించి నేర్చుకున్నా.
ప్రస్తుతం 9 సినిమాలకు సైన్ చేశాను. అందులో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘బ్లాక్ గోల్డ్’, శర్వానంద్ జోడిగా ‘నారీ నారీ నడుమ మురారీ’, బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘హైందవ’, నిఖిల్‌తో కలిసి ‘స్వయంభు, లారెన్స్‌తో ‘బెంజ్’, పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఓ సినిమాతో పాటు హిందీలో ‘మహారాణి’ చేస్తున్నా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

