హీరో విశాల్ నటించిన కొత్త సినిమా సామాన్యుడు. డింపుల్ హయతి నాయికగా నటిస్తున్నది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు తుప శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన సామాన్యుడు సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన సినిమా ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తున్నదని.. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ కెవిన్ రాజ్.