Rupee slides | రికార్డు కనిష్ఠానికి రూపాయి విలువ.. కారణాలు ఇవే..!
Rupee slides | రూపాయి విలువ (Rupee value) సోమవారం జీవనకాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్ (US Dollar) తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.2 శాతం క్షీణించి 96.20 వద్ద ఆల్ టైమ్ లోయర్ స్థాయికి చేరింది. పశ్చిమాసియా (West Asia) లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయడం రూపాయి విలువపై ప్రభావం చూపింది.
Rupee slides : రూపాయి విలువ (Rupee value) సోమవారం జీవనకాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్ (US Dollar) తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.2 శాతం క్షీణించి 96.20 వద్ద ఆల్ టైమ్ లోయర్ స్థాయికి చేరింది. పశ్చిమాసియా (West Asia) లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయడం రూపాయి విలువపై ప్రభావం చూపింది. దాంతో భారీ పతనం నమోదైంది. అమెరికన్ డాలర్‌తో పోల్చితే గత శుక్రవారం తొలిసారిగా రూ.96 మార్కును దాటిన రూపాయి, సోమవారం మరింత బలహీనపడింది.
ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. యూఏఈలోని ఓ అణు విద్యుత్ కేంద్రంపై దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 111 డాలర్లకు పెరిగింది. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు దిగవచ్చన్న సంకేతాలు కూడా ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డాలర్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. రూపాయి రికార్డు స్థాయి పతనం దేశ స్థూల ఆర్థిక దృక్పథంపై ఆందోళనలను తీవ్రతరం చేస్తోంది.
ఈ బలహీన సెంటిమెంట్ స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం చూపింది. సోమవారం సెన్సెక్స్ 808 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మరోవైపు, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు చేపట్టాయి. వెండి దిగుమతులపై ఆంక్షలు విధించడంతో పాటు, కరెన్సీ మార్కెట్లలో ఆర్బీఐ జోక్యం చేసుకుంటోంది. ఈ వారమంతా రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

