లండన్, నవంబర్ 14: ఎక్కడా ఆగకుండా 10 కిలోమీటర్లు పరిగెత్తడం సాధ్యమా? తనకు సాధ్యమేనని నిరూపించారు… ఇంగ్లండ్‌కు చెందిన హేదర్ హన్ (36). ఏడాది వయసున్న కొడుకును బేబీ స్ట్రోలర్‌లో ఉంచి దాన్ని నెడుతూ ఆమె 40 నిమిషాల నాలుగు సెకండ్లలో 10 కిలోమీటర్ల దూరం పరిగెత్తారు. ఇటీవల ఈ ఘనతను సాధించిన ఆమె పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది.