రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఆర్ఆర్బీ ఎన్టీపీసీ) సీబీటీ 2 పరీక్షా తేదీలు విడుదలయ్యాయి. పే లెవెల్ 4,6 పరీక్షలను మే 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది. ఈ పరీక్షా తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఆర్ఆర్బీ తన అధికార వెబ్సైట్లో ఉంచింది.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ -2 పే లెవెల్ 4,6 పరీక్షా తేదీలు మాత్రమే విడుదలయ్యాయి. పే లెవెల్ 2,3,5 పరీక్షా తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ-1 పరీక్షలు ఏడు దశల్లో డిసెంబర్ 28, 2020నుంచి జూలై 31, 2021 వరకు నిర్వహించింది. సీబీటీ-1 పరీక్షా ఫలితాలను మార్చి 30, 2022 – ఏప్రిల్ 1,2022 వరకు వెల్లడించారు. అభ్యర్థులు ఆర్ఆర్బీకి సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా అధికారిక వెబ్సైట్ మాత్రమే చూడాలని, అనధికార వార్తలను నమ్మొద్దని ఆర్ఆర్బీ కోరింది.